> డివైన్ సీడ్ ఇన్ హార్ట్ > DSH గురించి
శ్రీ గురురాయ గోవర్ధన్ జీ గురుదేవుల వారు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం , నెల్లూరు జిల్లా, మనుబోలు గ్రామం లో 7.1.1984 న జన్మించారు. తన జీవితంలో 16 వ సంవత్సరం నుండి అతను ఒక దైవిక జీవి యొక్క అరుదైన లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చారు.
తన ఆధ్యాత్మిక బోధనలు, హోమ క్రతువులు, యోగ సాధన, నిస్వార్థ సేవలు మరియు వారు చూపే సహజప్రేమ వందలాది ప్రజలను ఆకర్షించింది. సాధన చేసేవారికి దైవిక శక్తి స్పష్టమైన అనుభూతిని కలిగిస్తుందని శ్రీ గురురాయల వారు నొక్కి చెప్పారు.
ప్రతి మనిషి దైవానుగ్రహము పొందాలని The Divine seed in Heart Organization ను స్థాపించి, 2022 లో భారతదేశం లోని చట్టాల ప్రకారం నామోదు చేసుకున్నారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ పూర్తిగా శ్రీ గురురాయల వారిచే స్థాపించబడి ఐదుగురు ధర్మకర్తలచే నిర్వహించబడుతున్నది.