హోమ్

> భక్తిని పొందండి > సంకీర్తన

సంకీర్తన

కీర్తన వ్యక్తి గతమైన కళ్యాణమును చేకూర్చును, సంకీర్తన మొత్తం విశ్వానికే కళ్యాణమును చేకూర్చును, దీనికే "సామూహిక భజన" అని మరొక పేరు. సంకీర్తన అనేది నాలుగు విధములుగా వుంటున్నది. 1. గుణ సంకీర్తన, 2. లీలా సంకీర్తన, 3. భావ సంకీర్తన, 4. నామ సంకీర్తన.

filter_vintage 🌹భగవంతుని సద్గుణాలను వర్ణిస్తూ సంకీర్తన చేయడమే గుణ సంకీర్తన.

filter_vintage 🌹భగవంతుని లీలలను నృత్య రూపంలో ఆడుకొంటూ, అనుభవిస్తూ సంకీర్తన చేయడమే లీలా సంకీర్తన.

filter_vintage 🌹భగవంతుని తత్వము నందు, భక్తుని తత్వమును లీనాము చేసి సంకీర్తన చేయడమే భావ సంకీర్తన.

filter_vintage 🌹అఖిల నామములు, రూపములు భగవంతునిగా భావించి సంకీర్తన చేయడమే నామ సంకీర్తన.

భగవంతుని ఏ నామమునైన గానాముగా మార్చుకొని పాడినప్పుడు, నామములోని మాధుర్యం హృదయాన్ని లాగుతుంది, హృదయాన్ని ద్రవింప జేస్తుంది, హృదయాన్ని రమింపజేసి దైవాన్ని వశం చేస్తుంది.