ఆశ్రమం గురుంచి > శ్రీ గురు నిలయం
శ్రీ గురు నిలయం అంటే "అత్యున్నత గురువుల ఆశీర్వాద నిలయం" అని అర్ధము. ఇది గూడూరు పట్టణానికి సమీపంలో ఉంది, దాని దక్షిణమున పంబలేరు నది వాగు ఉంది. ఇందులో శ్రీ లక్ష్మి నారాయణ ఘన విజయం మందిరం, సత్సంగ హల్, ట్రస్ట్ కార్యాలయము ఉన్నాయి.
శ్రీ గురురాయల వారు ఎక్కువ కాలంను శ్రీ గురు నిలయములో గడుపుతున్నారు, అందువలన భిన్న సంస్కృతుల ప్రజలు వెలాదిగ వచ్చి దర్శించి వారి వారి ఆధ్యాత్మిక ఆకాంక్షలకు అసరమైన స్వచ్చమైన సహజ ప్రేమను అనుభవించి ఆనందముగా జీవించుచున్నారు.
శ్రీ గురు నిలయం సందర్శకులకు శ్రీ గురురాయల వారు కొన్ని మార్గదర్శకాలను, కొన్ని పరిమితులను విధించారు. భక్తులు తమ విలువైన సమయమును గడపడానికి కొన్ని పద్దతులను శ్రీ గురురాయల వారు సిఫార్సు చేసినారు. దీర్ఘకాలంగా వున్నవారు లేదా కొత్తగా వచ్చినవారు సిఫార్సులను గమనించాలి. ఇది పరమాత్మ తో ఏకమైయున్న సూక్ష్మ గురువుల పవిత్ర నివాస నిలయము, కావున ఈ నిలయమును తక్కువ గౌరవముతో చూడకూడదు. మీరు ఎక్కడినుండో ఇక్కడికి వచ్చారు ఈ అవకాశాన్ని తేలికగా పరిగణించవద్దు.మీ బాధలను,అవసరాలను, సమస్యలను ఇక్కడ ఉన్నవారి చెవుల్లోకి నెట్టవద్దు.ధ్యానం,జపం,ప్రభునామము వ్రాసేవారికి బిగ్గరగా మాట్లడుతూ భంగం కలిగించవద్దు. మీరు ధనమును ఖర్చు చేసి చాలా ఇబ్బందులు పడుతు ఇక్కడికి చేరుకొన్నారు. ఈ సమయమును వృథా చేయక ఆథ్యాత్మిక మార్గములో భగవంతుని చేరు విధముగా ఇక్కడ ధ్యానం చేయండి,ప్రభునామమును జపించండి లేదా వ్రాయండి.వీటి ద్వారా ఇంద్రియాలను ఆత్మకు విదేయులైన సేవకులుగా మార్చవచ్చును. మీరు వీటిని చేయలేక పోతే కనీసం వీటిని చేస్తున్న ఇతరులను ఇబ్బంది పెట్టకండి.విలువైన - గౌరవమైన "గురు భక్తులు" అనే బిరుదుకు అర్హులు అవ్వండి.
మీరు పాటించే ధర్మం, మీ వ్యక్తి గత ప్రార్థనలు, మీ యొక్క స్వీయ నియంత్రణ, మీ విశ్వాసం, మీ స్థిరత్వం,మీరు చేసే సేవలు ద్వారా శ్రీ గురు నిలయ మహిమ ఈ ప్రపంచములో ప్రతిరోజూ వ్యాప్తి చెందుతూ ఉంటుంది.