> డివైన్ సీడ్ > శాంతి
"శాంతి నీ స్వరూపమే." అట్టి శాంతిని పొందటానికి బయట ప్రపంచంలో వెదకనక్కరలేదు. సైంటిస్టులు భౌతికమైన అనుకూలాలను అందిస్తున్నారు, వాటి ద్వారా తాత్కాలికమైన ఆనందాన్ని, సుఖములను అనుభవిస్తున్నాం గానీ శాంతికి దూరమైపోతున్నాము. తాత్కాలికమైన అనుకూలాలు ఎంత సుఖాన్ని అందిస్తున్నాయో అంత కష్టాన్ని కూడా అందిస్తున్నాయి.
శాంతి లేని వారి మెదడు వేడెకుతుంది. దీని మూలమున మానవుల శారీరక, మానసిక రోగాలు అధికమైపోతున్నాయి. ఎప్పుడు చూసినా ఆలోచనలు.. ఆలోచనలు దాని వల్ల మైండ్ శ్రమిస్తోంది. మనం కనిపెట్టిన మిషన్స్ కు కూడా విశ్రాంతి ఇస్తున్నాం. కానీ మెదడుకు విశ్రాంతి ఇవ్వటము లేదు ? ఎక్కువ తెలివితేటలున్న వాని మైండ్ devil's workshop, ఈ devil's workshop కు ఏమి శాంతి ఉంటుంది ? వ్యక్తిగత శాంతి, సామాజిక శాంతి, దేశ శాంతి మనకు ఒక్క ఆధ్యాత్మిక మార్గములో తప్ప అన్య మార్గములో రాదు. .