> డివైన్ సీడ్ > భక్తి
"భగవంతుని పై గల ప్రేమయే భక్తి."
భక్తి అనేది ఆరాధన,భజనల చేత నిరూపించి,చూపించేది కాదు. హృదయ మానస సరోవరం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమ జలమే భక్తి.
వేదమునందు ' పత్రం ' అనగా దేహము అని అర్థము. ఈ దేహామనే పత్రము ఎప్పుడు రాలుతుందో ? ఎప్పుడు కాలు తుందో ? వేసవి వచ్చేటప్పటికీ ఆకులు ఏ విధముగా రాలిపోతాయే, అదే విధముగా కాలము గడిచే కొద్ది మానవ దేహము కూడా రాలిపోతుంది. కనుక ఈ దేహమనే పత్రమును భగవంతునికి అర్పితం చేయాలి. భక్తి కంటే మించిన వస్తువు ఈ జగత్తులో మరోకటి లేదు. భారతదేశములో ప్రాచీన కాలంనుండి భక్తికి ప్రధానమైన స్థానం యివ్వబడింది.
" భక్తికి మించిన ధనం, భక్తికి సమానమైన తూకం మరోకటి లేదు".