హోమ్

> ఆశ్రమం గురుంచి > ఘన విజయ మందిరం

ఘన విజయ మందిరం

భరించారని బాధలు సంభవించిన పరిస్థితుల యందు కూడా మానవుడు నాకు ఎవరు లేరు. నేను అనాధుడును అని విచారించ కూడదు. ఎందుకనగా నిజానికి "నారాయణుడొక్కడే అనాధుడు", మిగిలిన జీవరాశికి నారాయణుడే నాథుడు .

నారాయణుడే శ్వాసా, నారాయణుడే కాంతి, నారాయణుడే దృశ్యము, నారాయణుడే శబ్దము, నారాయణుడే చూపు , నారాయణుడే అనుభూతి , నారాయణుడే అంతరంగము , నారాయణుడే సమస్త విశ్వము, నారాయణుడే శాసనము. మానవునికి భరించరారని భాధలు సంభవించినప్పుడు భగవంతుడైన నారాయణుడే భాధ్యాత వహించి మానవునివైపు నడిచివచ్చును, లేని ఎడల మానవుడు ఎదురు చూడవలసి వచ్చును . నారాయణ దయను అఖిల మానవులకు అందించాలని వేదము యందు రహస్యముగా యున్న మంత్ర శబ్దాలను నారాయణ - లక్ష్మీ మాత రూపాములను విగ్రహములుగా మలచి "ఘన విజయ మందిరము" నందు గురురాయ ప్రతిష్టించను. శరీరమునకు జయమును, జీవునకు విజయమును , ఆత్మకు ఘన విజయమును ప్రసాదించు ఆశీర్వాదములను అందిస్తూ, లక్ష్మీ నారాయణులు ఘన విజయ మందిరం నందు వీరాజిల్లుతున్నారు .

ప్రత్యేకతలు :-

🙏లక్ష్మీ మాత స్థిర మైన లక్ష్మీనీ ప్రసాదించే రూపమున, నారాయణుడు సకల అభయముల ప్రధాతగా దర్శనమిస్తున్నారు.

🙏భక్తులు మూల మూర్తులను స్వహస్తములతో తాకి ప్రార్థించు కొనవచ్చును.

🙏 ఆదివారము మాత్రమే భక్తులకు దర్శన భాగ్యము

🙏 జన్మత దరిద్రమును అనుభవించువారు కూడా ఘన విజయ మందిరము నందు జరుపుకున్న, శ్రీనివాస విద్యా హోమ ప్రక్రియ ద్వారా సంపదతో, సంతోషముగా జీవిస్తున్నారు.

🙏ఆదివారం ఎక్కడ లేని విధముగా గర్భగుడిలో మూలముర్తుల ముందు పవిత్ర హోమమును నిర్వహిస్తారు.

🙏ఒక్కసారి ఘన విజయ మందిరము నందు హోమము నిర్వహించుకున్న వారికి, ఎక్కడ లేని విధముగా జీవితాంతము సంవత్సరానికి ఒక్కసారి ఉచితముగా వారి సంరక్షణ, స్థిరమైన లక్ష్మీ కటాక్షం,సంకట పరిస్ధితుల నందు ఘన విజయం పొందుట కొరకు విజయ హోమము నిర్వహిస్తారు. హిందువులు బాగా ఆలోచించిన ......మీరు ఏ దైవభక్తులైన మీరు చేసే ప్రతి పూజ నందు ఆచమనం జరిపించినప్పుడు, ముందుగా మీరు పలికేది నారాయణ మంత్రములైన కేశవయ స్వాహా, నారాయణాయ స్వాహా, మధావాయ స్వాహా, గోవిందాయ నమః అంటారు, దీని అర్థం ఏమిటంటే అన్నిటికీ మొట్టమొదటి మూలం నారాయణుడే .... అట్టి నారాయణుని దర్శనమును పొందిన వారికి తిరుగుండదు కదా .. ఓం నమో లక్ష్మీ నారాయణయ