హోమ్

> భక్తిని పొందండి > పూజ

పూజ

భగవంతుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ. పూజ అనేది విశ్వములోని దివ్య శక్తులతో మనల్ని సామరస్యంగా ఉంచుతుంది. పూజ ద్వారా శారీరక దుఃఖము తొలగి, మానసిక వేదనను అధిగమించి, ఆథ్యాత్మిక చైతన్యంతో జీవితం సాగుతుంది.

పూజ చేయడం ద్వారా మన చుట్టూ " దైవిక శక్తి ప్రకంపనలు " సృష్టించబడతాయి. ఆ ప్రకంపనలు మానవ జీవితానికి అత్యవసరమైన మనశ్శాంతిని, భౌతిక శ్రేయస్సును కలిగించి, తరువాత నిజ స్వరూపమైన దైవాన్ని మరింత స్పష్టంగా తెలుసుకునేలా చేస్తాయి.

"భారతీయుల జీవితం కష్ట, నష్ట లతో కాకుండా,క్రమ బద్ధంగా కొనసాగడానికి పూజ అనే ఆచారం ఒక అత్యుతమ సహాయంగా సృష్టించబడింది ఋషులచే"