> భక్తిని పొందండి > హోమం
యజ్ఞ మనగా విష్ణు స్వరూపము. కవరుపై అడ్రసు సరిగా వ్రాసి పోస్టు బాక్సులో వేస్తే, ఎన్నో మైళ్ళ దూరములో ఉన్న ఊరికైన వెళ్ళగలదు. అడ్రసును మంత్రముగా చేసి యజ్ఞకుండములో పవిత్రమైన పూజా ద్రవ్యములను మరియు ఆవునేతిని అర్పితం చేసిన సత్య స్వరూపుడైన భగవంతుణ్ణి చేరుతుంది
ఈరోజుల్లో చాలామంది ఇలా మాట్లాడుతుంటారు. విలువైన ఆవునేతిని అగ్ని పాలు చేయడం మూర్ఖత్వమని విమర్శిస్తున్నారు. అలా విమర్శించే వారే మూర్ఖులు. రైతు నాలుగు మూటల వడ్లు తీసుకుపోయి బురదలో చల్లుతాడు,ఏమిటి నాలుగు మూటల వడ్లను బురదలో పడవేస్తున్నాడే, అని ఎవరైనా అనుకుంటారా? ఇప్పుడు నాలుగు ముటల వడ్లను బురదలో చల్లితే, నాలుగు నెలల తరువాత నలభై మూటలను ఇంటికి తెచ్చుకో గలడు. యజ్ఞము కూడా అటువంటిదే. యజ్ఞ మనగా విష్ణు స్వరూపము. అది 'వేస్ట్' కాదు, భగవంతునికి 'టేస్ట్'!