హోమ్

> భక్తిని పొందండి > ప్రార్ధన

ప్రార్థన

ప్రార్ధన చేయటానికి కావలసింది అనవసరపు హంగులు, ఆర్భాటాలు కావు. ప్రార్థన అనేది ఆత్మ యొక్క స్వాధికారం. దేవుడు మనలను బిచ్చగాళ్ళగా పుట్టించలేదు . ఆయన మనలను తన దివ్య స్వరూపంలో సృష్టించాడు.పెద్ద ధనవంతుని ఇంటి వద్దకు వెళ్ళి భిక్ష అడిగే బిచ్చగాడు, బిచ్చగాడి వాటాను మాత్రమే పొందుతాడు, కానీ బిడ్డ తన ధనికుడైన తండ్రి నుండి ఏదైనా అడిగి పొందవచ్చు, తీసుకోవచ్చు, కావున మనం బిచ్చగాళ్ళలా ప్రవర్తించకూడదు. బిడ్డల వలే ప్రవర్తించాలి.

" నర, నారాయణులు, కృష్ణుడు, బుద్ధుడు, సత్యసాయి బాబా, రమణ మహర్షి, స్వామి శివానంద వంటి మహాత్ములు మనం దేవుని స్వరూపంలో తయారయ్యామని చెప్పినప్పుడు, వారి మాటలు అసత్యములు చెప్పవు కదా.”

మన ప్రార్ధన భగవంతునితో ప్రత్యక్షముగా సంభాషిస్తున్నట్లుగా వుండాలి. మన ప్రార్ధన ఇలా వుండాలి. " ఓ దేవదేవా నా కాలాన్ని వ్యర్థం కానీయకు స్వామి! నేనెంత సోమరినైన, తుంటరినైన, భాద్యతరహితుడనైన నన్ను నీ దృష్టి దాటి పోన్నివ్వకు స్వామి! నా తపొప్పులను తులాభారం వేస్తూ ఆలస్యం చెయ్యకు స్వామి! ఓ దేవదేవా నీ అనుగృహపుజల్లును నా పై కురిపించి పగలు, రాత్రి నా ప్రక్కనే వుంటు నా జీవితమును సరియైన బాట లో నడుపు తండ్రి.... ఓ దేవదేవా నీ కటాక్ష విక్షణములు నా పై ఏలవెలాల దండిగా కురిపించు తండ్రి". అని రోజుకు రెండు సార్లు క్రమం తప్పకుండా భగవంతుని మీద ఆధారపడి ఉన్నానని భావించి ప్రార్థన చేయాలి.