శ్రీ గురురాయ
నిజమైన గురువు పరమాత్మునితో ఐక్యతను సాధించి, తద్వారా ఇతరులను ఆ లక్ష్యం వైపు నడిపించ కలిగే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉంటాడు.
శ్రీ గురురాయల వారి సన్నిధికి విభిన్న సంస్కృతుల వారు, పలు రకాల మత విశ్వాసాలతో పెరిగినవారు, వేరువేరు విద్యార్హతలు కలిగినవారు, రక రకాలైన వృత్తులలో రాణించెవారు వస్తున్నారు.
ఇలా వచ్చిన వారందరిలో స్వీయ-క్రమశిక్షణ, భక్తితో ప్రార్ధన, బుద్ధితో ఆత్మపరిశీలన, అంకితభావంతో ధ్యానం, ప్రేమతో కూడిన సేవ ,తనను తాను పూర్తిగా తెలుసుకోవడం అనే సాధనాలను నేరుప్తు ఆత్మానందాన్ని ఆ భగవంతుడు మాత్రమే ఇవ్వగలడనే సత్యమును శ్రీ గురురాయల వారు అందరికీ తెలియజేస్తున్నారు. ఇలా అందరినీ ఒక్కటిగా చేర్చి పరమాత్మని వైపు అడుగులు వేయపించడం సామాన్యులకు కుదరదు.
శ్రీ గురు నిలయం
శ్రీ గురు నిలయం అంటే "అత్యున్నత గురువుల ఆశీర్వాద నిలయం" అని అర్ధము. ఇది గూడూరు పట్టణానికి సమీపంలో ఉంది, దాని దక్షిణమున పంబలేరు నది వాగు ఉంది. ఇందులో శ్రీ లక్ష్మి నారాయణ ఘన విజయం మందిరం, సత్సంగ హల్, ట్రస్ట్ కార్యాలయము ఉన్నాయి.
శ్రీ గురురాయల వారు ఎక్కువ కాలంను శ్రీ గురు నిలయములో గడుపుతున్నారు, అందువలన భిన్న సంస్కృతుల ప్రజలు వెలాదిగ వచ్చి దర్శించి వారి వారి ఆధ్యాత్మిక ఆకాంక్షలకు అసరమైన స్వచ్చమైన సహజ ప్రేమను అనుభవించి ఆనందముగా జీవించుచున్నారు.
శ్రీ గురు నిలయం సందర్శకులకు శ్రీ గురురాయల వారు కొన్ని మార్గదర్శకాలను, కొన్ని పరిమితులను విధించారు. భక్తులు తమ విలువైన సమయమును గడపడానికి కొన్ని పద్దతులను శ్రీ గురురాయల వారు సిఫార్సు చేసినారు. దీర్ఘకాలంగా వున్నవారు లేదా కొత్తగా వచ్చినవారు సిఫార్సులను గమనించాలి. ఇది పరమాత్మ తో ఏకమైయున్న సూక్ష్మ గురువుల పవిత్ర నివాస నిలయము, కావున ఈ నిలయమును తక్కువ గౌరవముతో చూడకూడదు. మీరు ఎక్కడినుండో ఇక్కడికి వచ్చారు ఈ అవకాశాన్ని తేలికగా పరిగణించవద్దు.మీ బాధలను,అవసరాలను, సమస్యలను ఇక్కడ ఉన్నవారి చెవుల్లోకి నెట్టవద్దు.ధ్యానం,జపం,ప్రభునామము వ్రాసేవారికి బిగ్గరగా మాట్లడుతూ భంగం కలిగించవద్దు. మీరు ధనమును ఖర్చు చేసి చాలా ఇబ్బందులు పడుతు ఇక్కడికి చేరుకొన్నారు. ఈ సమయమును వృథా చేయక ఆథ్యాత్మిక మార్గములో భగవంతుని చేరు విధముగా ఇక్కడ ధ్యానం చేయండి,ప్రభునామమును జపించండి లేదా వ్రాయండి.వీటి ద్వారా ఇంద్రియాలను ఆత్మకు విదేయులైన సేవకులుగా మార్చవచ్చును. మీరు వీటిని చేయలేక పోతే కనీసం వీటిని చేస్తున్న ఇతరులను ఇబ్బంది పెట్టకండి.విలువైన - గౌరవమైన "గురు భక్తులు" అనే బిరుదుకు అర్హులు అవ్వండి.
మీరు పాటించే ధర్మం, మీ వ్యక్తి గత ప్రార్థనలు, మీ యొక్క స్వీయ నియంత్రణ, మీ విశ్వాసం, మీ స్థిరత్వం,మీరు చేసే సేవలు ద్వారా శ్రీ గురు నిలయ మహిమ ఈ ప్రపంచములో ప్రతిరోజూ వ్యాప్తి చెందుతూ ఉంటుంది.
మా గురించి
శ్రీ గురురాయ గోవర్ధన్ జీ గురుదేవుల వారు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం , నెల్లూరు జిల్లా, మనుబోలు గ్రామం లో 7.1.1984 న జన్మించారు. తన జీవితంలో 16 వ సంవత్సరం నుండి అతను ఒక దైవిక జీవి యొక్క అరుదైన లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చారు.
తన ఆధ్యాత్మిక బోధనలు, హోమ క్రతువులు, యోగ సాధన, నిస్వార్థ సేవలు మరియు వారు చూపే సహజప్రేమ వందలాది ప్రజలను ఆకర్షించింది. సాధన చేసేవారికి దైవిక శక్తి స్పష్టమైన అనుభూతిని కలిగిస్తుందని శ్రీ గురురాయల వారు నొక్కి చెప్పారు.
ప్రతి మనిషి దైవానుగ్రహము పొందాలని The Divine seed in Heart Organization ను స్థాపించి, 2022 లో భారతదేశం లోని చట్టాల ప్రకారం నమోదు చేసుకున్నారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ పూర్తిగా శ్రీ గురురాయల వారిచే స్థాపించబడి ఐదుగురు ధర్మకర్తలచే నిర్వహించబడుతున్నది.
ఈ ప్రపంచం మొత్తం సత్యం నుండి ఉద్భవించింది, జీవితాలు సత్యం మీద మరియు సత్యంలో మునిగిపోయాడు.
ఇంకా చదవండిధ్యాన సాధన కోసం మీ స్వంత స్థలాన్ని సెటప్ చేయండి. ఆ స్థలాన్ని పవిత్రంగా మరియు శుభ్రంగా ఉంచండి.
ఇంకా చదవండిసేవ అనేది పదునైన కత్తి లాంటిది.అది బాగా తెలిసిన వ్యక్తి చేతిలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది.
ఇంకా చదవండిగురు పరంపర
ఎఫ్ ఎ క్యూ
ఆధ్యాత్మికం