హోమ్

> డివైన్ సీడ్ > ధ్యానించు

ధ్యానించు

ధ్యాన సాధన కోసం ప్రత్యేకంగా సొంత స్థలమును ఏర్పాటు చేసుకోండి. ఆ స్థలమును పవిత్రముగా, పరిశుభ్రంగా ఉంచుకోండి. నిటారుగా ఉన్న కుర్చీపై కూర్చోండి లేదా సుఖాసనంలో కూర్చోండి,వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ కళ్ళు మూసుకుని, మెల్లగా మీ చూపును ఒత్తిడి లేకుండా పైకి ఎత్తి కనుబొమ్మల మధ్య దివ్యజ్ఞానానికి స్థానమైన ఆధ్యాత్మిక నేత్రం వద్ద ఉంచండి.(ఆధ్యాత్మిక నేత్రాన్ని దర్శించడానికి ఏకాగ్రత, పట్టుదల, ఓర్పుతో కూడిన ప్రశాంతత అవసరం.) ఆధ్యాత్మిక నేత్రాన్ని చూడగలిగిన వారు దానిలోకి చొచ్చుకుపోయి మీ హృదయ భాషతో భగవంతుని గాఢంగా ప్రార్థించండి. శరీరంలో ప్రాణం, మనస్సులో కాంతి, ఆత్మలో శాంతి కొలువై వుంటాయి. ఆత్మలోకి ఎంత లోతుగా వెళితే అంత శాంతిని అనుభూతి చెందుతారు. అదే పరమాత్మ చైతన్యం. ధ్యానసాధన ఉదయం ముప్పై నిమిషాలు మరియు రాత్రి ముప్పై నిమిషాలు ఉండాలి. మీరు ధ్యానంలో ప్రశాంత స్థితిని ఆస్వాదిస్తూ ఎంత ఎక్కువ సేపు కూర్చోగలరో, ఆధ్యాత్మికంగా అంత వేగంగా అభివృద్ధి చెందుతారు. ధ్యానంలో మీరు అనుభవించే ప్రశాంతతను మీ రోజువారీ కార్యకలాపాల్లోకి తీసుకెళ్ళండి, ఆ ప్రశాంతత మీకు అన్ని విధములుగా సహాయం చేస్తుంది.