> డివైన్ సీడ్ > సేవ
సేవ అనేది పదునైన కత్తి వంటిది. దాని ప్రయోజనామును గురించి చక్కగా తెలిసిన వ్యక్తి చేతిలో వున్నప్పుడు అది ఉపకారం చేస్తుంది. దాని స్థితిగతులు గురించి తెలియని వారి చేతిలో ఉంటే అపకారం చేస్తుంది.
సేవ అనేది ఎవరినీ ఆకర్షించేందుకు చేసే కళ (ఆర్ట్) కాదు. సేవ హార్ట్ నుండి వచ్చేది( Art is external, Heart is Internal ). "చెప్పేది చేయాలి - చేసింది చెప్పాలి."
సేవను చేతులతో,మాటలతో,మనస్సుతో చేయవచ్చును. సేవ చేయటం వలన హృదయ విశాలత పెరుగుతుంది. సేవద్వార భగవంతుని మెప్పును కూడా పొందవచ్చును. గొప్పగా సేవ గురించి ప్రసంగాలు చేయుటకంటే చేసి చూపించడంలో గొప్పతనం ఉంది.
పరులకు సేవ చేసేటప్పుడు, సేవలు అందుకునే వారు మనకన్నా తక్కువ వరానే చులకన భావన ఉండకూడదు.
పేదలకు సేవలు చేయడానికి శక్తి ఉండినా వెనకడుగు వేసేవారు దొంగలు, తమ శక్తికి మించిన సేవలు చేసేవారు అహంకరులు. శ్రీ గురునిలయ కుటుంబ సభ్యులు దొంగలుగా గాని, అహంకరులగా గాని తయారుకాకండి, శక్తి వంచన లేకుండా సేవలు చేయండి.
"మానవ సేవే మాధవ సేవ యని, జన సేవే జనార్ధన సేవ యని,సమాజ సేవే సర్వేశ్వర సేవయని,విశ్వ సేవే విష్ణు సేవయని" భావించి చేసే వారిని భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. సేవకంటే మించిన సాధన మరొకటి లేదు.